'డిప్రెషన్' ని ఢీ కొనే ఆయుధాలు పళ్లు,కూరగాయలంటే నమ్ముతారా

updated: March 6, 2018 23:37 IST

 లవ్ ఫెయిల్యూర్, కెరీర్ లో ఎదుగుదల లేకపోవటం, పరీక్షల్లో ఫెయిల్ అవటం..ఇలా కారణం ఏదైనా మనిషి కుంగిపోతూంటారు. తేలిగ్గా డిప్రెషన్ కు లోనవుతూంటారు. అయితే కొందరు తేలిగ్గా కొద్ది రోజుల్లోనే ఆ డిప్రెషన్ బారి నుంచి బయిటపడి..మిగతా వ్యాపకాల్లో బిజీ అవుతారు. అయితే కొందరు ఎంతకాలమైనా అలాగే ఉండిపోతారు. అలా తరుచుగా డిప్రెషన్ కు లోనవటం, దాని నుంచి బయిటకు రాలేకపోవటానికి కారణం ..మనం రోజూ వారి తీసుకునే ఆహారమే కారణం అంటున్నారు. 

ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేస్తే అసలు డిప్రెషన్ మన జోలికి రాదని అంటున్నారు. ముఖ్యంగా మన ఆహారంలో  భాగంగా పళ్లు,కూరగాయలు తీసుకోవటం పెంచాలి అంటున్నారు.  అదే ఈ డిప్రెషన్ కు చక్కటి పరిష్కారం   అంటున్నారు అమెరికాలోని మెడికల్ రీసెర్చర్స్.  చక్కటి పళ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ తో ఈ డిప్రెషన్ ని ఎదుర్కోవటం సాధ్యమే అని తేలుస్తున్నారు.  వీటిన్నటిని సమపాళ్లతో కూడిన డైట్ ని తీసుకుంటే బరువు తగ్గటం, బిపీ తగ్గటం, కొలిస్ట్రాల్ లెవిల్స్ తగ్గటం  వంటివి జరిగి..శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు వచ్చి..డిప్రెషన్ తగ్గుమొహం పడుతుందని అంటున్నారు. అలాగే ఇవి రెగ్యులర్ గా తీసుకునేవాళ్లకు డిప్రెషన్ దరిచేరదని హామీ ఇస్తున్నారు.ముఖ్యంగా మన లైఫ్ స్టైయిల్ ని, ఆహారపు అలవాట్లును  మార్చితే అన్ని అవే సర్దుకుంటాయని తమ రీసెర్చ్ లో తేలిందని చికాగోలోని రష్ యూనివర్శిటీ కు చెందిన రీసెర్చ్ లీడర్ లారెల్ చెరెన్ చెప్తున్నారు. గత ఆరున్నర సంవత్సరాలుగా 964 మంది పై చేసిన ఈ అధ్యయనం మంచి ఫలితాలనే ఇచ్చిందని ..డిప్రెషన్ ని ఢీ కొట్టడానికి పళ్లు, కూరగాయలనే ఆయుధంగా ఉపయోగించాలని తేలిందని అన్నారు. ఈ విషయమై మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. 

  డిప్రెషన్ లక్షణాలుకు వస్తే..

ఏ విషయాలు పట్టించుకోకుండా, ఎక్కడికీ వెళ్లకుండా నిరాసక్తంగా ప్రవర్తించడం. ఎప్పుడూ అలసిపోయినట్టు, నిరాశగా కనిపించడం, ఒంటరితనాన్ని ఇష్టపడడం వంటివన్నీ డిప్రెషన్‌ ప్రధాన లక్షణాలు.   అలాగే   ఏదో కోల్పోయినట్టు, విచారంగా ఉండటం, ... ఇక ఫంక్షన్లు, పార్టీలకయితే ఆమడదూరంలో ఉండటం.... అయిన దానికి కాని దానికి చిరాకు పడటం ఇవన్ని ఓ మనిషిలో కనిపిస్తున్నాయంటే వాళ్లు ఆడయినా,మగైనా డిప్రెషన్ లో ఉన్నట్లు లెక్క. ముఖ్యంగా చక్కగా ఉషారుగా ఉండేవాళ్లు ... ఇదేంటి ఇలా అయ్యిపోతున్నారు   అని ఆ ప్రవర్తనను గమనించిన కుటుంబ సభ్యులు వాళ్లను ని ఆహ్లాదంగా ఉంచేందుకు ప్రయత్నించినా  డిప్రెషన్ లో ఉండేవాళ్లలో ఎటువంటి మార్పు రాలేదు.  వీళ్లు కుటుంబమంతా తన వెంటే ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నట్టు, నిస్సహాయురాలైనట్టు భావిస్తూంటారు.  వాస్తవానికి డిప్రెషన్‌ కూడా ఒక అనారోగ్యమే అనే విషయాన్ని గమనించాలి.   

Photo by Jakub Kapusnak on Unsplash

comments